
ప్రజాశక్తి-విజయనగరం : వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయాన్ని సోమవారం విశాఖపట్నం రేంజ్ డిఐజి ఎస్. హరికృష్ణ పరిశీలించారు. ఆయనకు ఎస్‌పి ఎం.దీపిక, పోలీసు అధికారులు పలికారు. అనంతరం, జిల్లా పోలీసు కార్యాలయంలోని వివిధ సెక్షన్లు, వివిధ రకాల విధులు నిర్వహించే కార్యాలయ అధికారులు, సిబ్బంది నిర్వహించే వివిధ రికార్డులను, ఉన్నత పోలీసు కార్యాలయాలతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలను పరిశీలించారు. జిల్లా నేర రికార్డ్సు బ్యూరో, స్పెషల్ బ్రాంచ్, పాస్‌పోర్టు సెల్ అధికారులు, సిబ్బంది పని తీరును, రికార్డులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేసారు. పోలీసు కేంద్ర కార్యాలయం నుండి వచ్చిన స్టోర్ ఆర్టికల్స్, ఆయుధాలు, రికార్డులు, మోటారు వాహనాలు, వాటి పని తీరు, రికార్డులు, పోలీసుల సంక్షేమానికి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను డిఐజి అడిగి తెలుసుకున్నారు. జిల్లా పోలీసుశాఖ సాధించిన ప్రగతిని, పోలీసుల సంక్షేమానికి పోలీసుశాఖ చేపడుతున్న కార్యక్రమాలను ఎస్‌పి వివరించారు. కార్యక్రమంలో ఎస్‌పి ఎం.దీపిక, ఎఆర్ అదనపు ఎస్‌పి ఎం.ఎం.సోల్మన్, డిఎస్‌పి ఆర్. శ్రీనివాసరావు, ఎఆర్ డిఎస్‌పి ఎల్. శేషాద్రి, డిపిఒ ఎఒ వెంకట రమణ, సిఐలు సిహెచ్. రుద్రశేఖర్, బి.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.