
ప్రజాశక్తి-అమలాపురం
జిఒ నెంబర్ 117తో విద్యారంగం విధ్వంసం పతనంకాబోతోందని ఎంఎల్సి ఐ. వెంకటేశ్వర రావు ఆరోపించారు. జిఒ నెంబర్ 117పై అమలాపురం యుటిఎఫ్హోమ్లో ఆదివారం యుటిఎఫ్ కోనసీమ జిల్లా గౌరవ అధ్యక్షుడు సుబ్బారావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎంఎల్సి ఐవి మాట్లాడుతూ జిఒ117పై టిడిపి, జనసేన పార్టీలు కూడా స్పందించాలి అని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 35,000 ప్రాథమిక పాఠశాలలను ప్రభుత్వం నెమ్మదిగా మూసేయాలని చూస్తోందని ఆరోపించారు. ఉన్నత పాఠశాలలో 48 పీరియడ్స్ బోధించాలి అనడం అశాస్త్రీయం అన్నారు. మండలాల వారీగా కరపత్రాలు వేసి ప్రచారం చేయాలన్నారు. ఇంగ్లిష్ మీడియం, తెలుగు మీడియం సమాంతరంగా కొనసాగలి అని అన్నారు. ప్లస్2లకు ప్రమోషన్ లు, మౌలిక వసతులు కల్పించాలి అన్నారు.
జిఒ 117 విద్యారంగానికి గొడ్డలిపెట్టు
ఈ సందర్భంగా యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి జ్యోతిబసు మాట్లాడుతూ జిఒ నెంబర్ 117 విద్యా రంగానికి గొడ్డలి పెట్టు అని దీన్ని రద్దు చేయకపోతే యుటిఎఫ్ తరుపున పెద్ద ఎత్తున పోరాడతామని తెలిపారు. యుటిఎఫ్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులపై భారం పెంచుతూ, పేదలకు విద్యను దూరం చేస్తున్న జిఒ నెంబర్ 117ని తక్షణమే రద్దు చేయలని అన్నారు కెవిపిఎస్ నాయకులు నాయకులు కారెం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పేద, దళితులకు విద్య దూరం చేసే ఈ జిఒ నెంబర్ 117ని వెంటనే రద్దు చేయాలని కోరారు. జన విజ్ఞాన వేదిక కార్యదర్శి ఇఆర్.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రాధమిక పాఠశాలలు విలీనం ఎన్ఇపి-2020లో లేదని, ప్రాథమిక విద్య మాతభాష లోనే ఉండాలని ప్రతీ పాఠశాల లోను తరగతికి ఒక టీచర్ ఉండాలని డిమాండ్ చేశారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చంద్రకళ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగ ప్రముఖులతో చర్చించకుండా జిఒలు తీసుకురావడం దుర్మార్గమని అన్నారు. దీంతో పేద పిల్లలు విద్యకు దూరం అవుతారని తెలిపారు. అసోసియేట్ అధ్యక్షురాలు గౌరీ నాగమణి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యను కార్పొరేటీకరణ చేయడంలో భాగంగా వచ్చిన ఈ జిఒను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. కెవిపిఎస్ నాయకులు వసంతకుమార్ మాట్లాడుతూ ఢిల్లీ, కేరళ రాష్ట్రాలు అమలు చేస్తున్న విద్యా విధానం మన రాష్ట్రంలో అమలుచేయాలని పిలుపునిచ్చారు. కిరణ్ సాల్ట్ ప్రోగ్రాం లో భాగంగా రూ.1700 కోట్ల అప్పు కోసం విద్యారంగాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు ఆనందరావు మాట్లాడుతూ ఈ జిఒతో డ్రాపౌట్లు పెరుగుతారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో యుటిఎ