
ప్రజాశక్తి-కొవ్వూరు : కోవూరు మైధిలిసెంటర్ లో జక్కా వెంకయ్య ఐదవ వర్ధంతి సభ, మజ్జిగ చలివేంద్ర ఏర్పాటు చేయడం జరిగింది. సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జొన్నలగడ్డ వెంకమ్మ రాజు మాట్లాడుతూ సిపిఎం సీనియర్ నాయకులు జక్కా వెంకయ్య సింహపురి రాజకీయ చరిత్రలో ఒక వేగుచుక్క భూస్వామ్య రాజకీయాలు పెత్తన దారులు రాజ్యమేలుతున్న తరుణంలో పేదల కోసం తను ఉన్నాను అంటూ సింహపురి గడ్డపై ఉదయించారు. జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగులో గ్రామంలో 1930 నవంబరు 3న జక్కా రమణయ్య, శంకరమ్మ దంపతులకు జన్మించారు. ఎస్ ఎల్ సి చదివారు తరువాత 1951 వరకు గ్రామంలోనే వ్యవసాయం చేశారు. 1948 నుంచి 1950 వరకు ఆనాటి కమ్యూనిస్టు పార్టీ నిషేధంలో ఉన్నందున రహస్య జీవితం గడిపే కమ్యూనిస్టు నాయకులు దామర మడుగులో తలదాచుకునేవారు గ్రామంలో జక్కా వెంకన్న వారికి రక్షణగా నిలిచారని చెప్పారు. జిల్లాలో కూలీ పోరాటం, భూపోరాటం,సారా ఉద్యమం, కరంటు ఉద్యమం, జిల్లా సమగ్ర నీటి పంపిణి విధానంలో మేధావి అన్నారు. ఐదో వర్ధంతి సభలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు, కోవూరు మండల కన్వీనర్ గండవరపు శేషయ్య డప్పుకళాకారు నాయకులు తల్లు శ్రీనివాసులు, ఎస్ కే బాబు, శ్రీనివాసులురెడ్డి, మల్లి కార్జునరెడ్డి పెద్దబ్బయ్య, రమేష్, సుబ్బారావు, విజయకుమార్ సురేంద్ర, ఎస్.కె చాంద్ బాషా, సురేష్, రత్నమ్మ, హసీనా,మీరాంబి, చిన్నమ్మ, హరి, మణి, జానికిరాం, కాదర్బాషా, బాబు వెంకటేష్, మాబాష, ఉమాయన్, కరిముళ్ల, అఖిల్ తదితరులు పాల్గొన్నారు,