Oct 18,2021 19:02

సాధారణంగా సీజన్‌ మారినప్పుడు చాలామందిని జలుబు సమస్య వేధిస్తుంది. కొన్ని ఇంటి చిట్కాలతో దాని నుంచి ఉపశమనం పొందడమెలాగో తెలుసుకుందాం.
-  జలుబు చేసినప్పుడు నీటిని చల్లగా కాకుండా వేడి చేసి తాగాలి. ఆ వేడి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తరచూ తాగుతుంటే త్వరగా ఉపశమనం వస్తుంది.
- జలుబు చేసినప్పుడు ఆవిరిపట్టడం వల్ల మూసుకుపోయిన ముక్కురంధ్రాలు తెరుచుకుంటాయి. ఆ వేడినీటిలో పసుపు, బామ్‌ వంటి వాటితోపాటు యూకలిప్టస్‌ ఆయిల్‌ కూడా వేస్తే మంచి ఫలితం ఉంటుంది.
-  వేడి పాలల్లో కాసింత పసుపు కలుపుకుని తాగాలి. ఈ చిట్కా రాత్రి వేళల్లో బాగా పనిచేస్తుంది. నిద్రలేమి సమస్య దూరమవుతుంది.
-  జలుబుతో బాధపడేవారు.. అల్లం టీ తాగడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. అల్లంలోని ప్రత్యేక గుణాలు జలుబు, జలుబు వల్ల వచ్చే దగ్గుని తగ్గిస్తాయి.
-  జలుబు ఉన్నవారు తులసి ఆకులు, రాక్‌ సాల్ట్‌ కలిపి నమిలి ఆ రసాన్ని మింగాలి. ఇలా చేయడం వల్ల జలుబు తగ్గుతుంది. నోటి నుంచి వచ్చే దుర్వాసన కూడా తగ్గుతుంది.
-  ఓ కప్పు నీటిలో స్పూన్‌ బార్లీ గింజలను వేసి మరిగించి వడకట్టి అందులో నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేస్తుండడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
-  జలుబుతో బాధపడేవారు కర్పూరం వాసన చూసినా మంచి ఫలితం ఉంటుంది. దీనితో పాటు వామాకు దంచి దానిలో కాస్తా కర్పూరాన్ని కలిపి ఆ వాసన చూడాలి. నీటిలో కర్పూరం వేసి ఆవిరి పట్టినా మంచి ఫలితం ఉంటుంది.