May 13,2022 22:08
  • జమ్ముకాశ్మీర్‌ పరిపాలనా విభాగానికి కూడా

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జమ్మూ కాశ్మీర్‌ డీలిమిటేషన్‌ పై నివేదిక ఇవ్వాలనికేంద్ర ప్రభుత్వానికి, ఎనిుకల సంఘానికి, జమ్ముకాశ్మీర్‌ పరిపాలనా విభాగానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్యానెల్‌ నివేదిక పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకుకూడా పిలుపునిచ్చింది. ఇప్పుడు ఐదు లోక్‌సభ స్థానాలు ఒక్కొక్కటి 18 అసెంబ్లీ నియోజకవర్గాలతో రూపొందించారు. మొత్తం సంఖ్య 90కి చేరింది. షెడ్యూల్డ్‌ తెగలకు9 అసెంబ్లీ స్థానాల రిజర్వేషన్లను ప్యానెల్‌ సిఫార్సు చేసింది. దీనిపై దాఖలైన పిటిషన్లను
న్యాయమూర్తులు జస్టిస్‌ సంజరు కిషన్‌ కౌల్‌,జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ పిటిషన్‌లో ఆర్టికల్‌ 370, 35(ఎ) రద్దుపై లేవనెత్తారు.