Oct 17,2020 13:04

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది మరణించినట్లు ఆర్మీ తెలిపింది. అనంత్‌నాగ్‌ జిల్లాలోని లార్నూ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో.. ప్రతిఘటించేందుకు చేసే ప్రయత్నంలో భాగంగా భదత్రా దళాలు ఎదురు కాల్పులకు దిగాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఉగ్రవాది మృతి చెందాడని తెలిపారు. ఘటనా స్థలంలో ఎకె రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.