May 15,2022 23:34

ఆందోళన చేస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన నిత్యావసరాల ధరలను తగ్గించాలని టిడిపి పార్లమెంట్‌ కోశాధికారి వి.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం జంగిడివలస గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలతో పాటు విద్యుత్‌ ధరలను పెంచడంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ భీమన్న, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.