Jun 23,2022 15:37

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కర్నూల్ కార్పొరేషన్ పరిధిలోని 46 వ వార్డు నరసింహా రెడ్డి నగర్, అశోక్ నగర్ ,పాల కొట్టాలు మొదలగు ప్రాంతాలలో జనం కోసం సిపిఎం ఇంటింటికి సిపిఎం అన్న పేరుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరిగింది. గురువారం 119. 120   వార్డు సచివాలయ ల లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సచివాలయ అడ్మిన్ లు అయినా వెంకటేష్, సౌమ్య లకు వార్డు సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి టీ.రాముడు. నగర కమిటీ సభ్యులు ఎస్. రఫీక్ హమ్మద్ లు మాట్లాడుతూ  నరసింహా రెడ్డి నగర్, అశోక్ నగర్ ,పాల కొట్టాల ప్రాంతంలో డ్రైనేజీ కాలవలు సిల్ట్ తో పేరుకుపోయి దుర్వాసనతో,   దోమలతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. కార్పొరేషన్ అధికారులకు ప్రజలపై పన్నులు  వేయడం పై ఉన్న శ్రద్ధ సమస్యలు పరిష్కరించడం పై లేదని విమర్శించారు .120 సచివాలయంలో నేటికీ  శానిటేషన్ సెక్రెటరీ లేకపోవడం బాధాకరమన్నారు. కమిషనర్ తక్షణమే శానిటేషన్ సెక్రెటరీ ఏర్పాటుచేసి డ్రైనేజీ కాలువలో పేరుకుపోయిన సిల్ట్ ను తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని అన్నారు .నరసింహా రెడ్డి నగర్,  కె సి కెనాల్ వెంబడి వెంటనే రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని ,ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు .టీడ్కో ఇళ్ళకు డబ్బులు చెల్లించి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటిదాకా ఇల్లు స్వాధీనం చేయలేదని బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిప్పుతూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు .వెంటనే లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ళను కేటాయించాలని డిమాండ్ చేశారు .ప్రజలకు భారంగా మారిన చెత్త పన్ను రద్దు చేయాలని అన్నారు .ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు గోపాల్, గౌస్, మళ్లీ, శ్రీనివాసులు, హుస్సేన్, చందు, తదితరులు పాల్గొన్నారు.