Jul 29,2021 21:58

ఫైల్‌ ఫొటో వెంకటసుబ్బయ్య


ఫైల్‌ ఫొటో వెంకటసుబ్బయ్య
జనసేన జిల్లా కార్యదర్శిగా
సమ్మను వెంకటసుబ్బయ్య
ప్రజాశక్తి-కావలి:జనసేనపార్టీ జిల్లాకార్యదర్శిగా కావలికిచెందిన పార్టీ మాజీ పట్టణఅధ్యక్షులు ,సమ్మను వెంకటసుబ్బయ్యను నియమించారు. 32మందితో జిల్లా కార్యవర్గాన్ని బుధవారం ప్రకటించగా, అందులో వెంకటసుబ్బయ్యకు ప్రాధాన్యత కల్పించారు. వెంకటసుబ్బయ్య జనసేనపార్టీ ఆవిర్భావం నాటినుంచి పార్టీ అభివృధ్ధికి కృషి చేశారు. 2019ఎన్నికల్లో జనసేనపార్టీ అభ్యర్థిగా పోటీచేసిన అభ్యర్థి బి.జె.పి.లోకి వెళ్ళిపోగా,అలాంటి సందర్భంలో పార్టీకి పెద్దదిక్కుగా నిలబడి,కార్యకర్తలను కాపాడుకున్నారు. కావలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ అళహరిసుధాకర్‌ నాయకత్వంలో వెంకటసుబ్బయ్య కొన్నాళ్ళపాటు కావలి పట్టణ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. ఎన్నోకష్టనష్టాలకోర్చి,పార్టీకి అండగా నిలిచారు. ఆయన దక్షతను గుర్తించి,జనసేనపార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఆయనకు జిల్లాకార్యదర్శిగా సముచిత స్థానాన్ని కల్పించారు. పార్టీలో కష్టపడేవారికి గుర్తింపు ఉంటుందని, పవన్‌కల్యాణ్‌ కార్యకర్తలకు న్యాయం చేస్తాడనడానికి నిదర్శనమిదేనంటూ జనసేన కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ.తనను పార్టీ జిల్లాకమిటీలో కార్యదర్శిగా ఎన్నిక చేసినందుకు పార్టీకి విధేయతగా పనిచేస్తానన్నారు. .తనకు ఈపదవి వచ్చేందుకు తనను ఆశీర్వదించిన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌,పార్టీ పి.ఏ.సి.చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, పార్టీ ప్రోగ్రామ్‌ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ కల్యాణం శివశ్రీనివాస్‌(కె.కె.), నెల్లూరు జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్‌రెడ్డి, కావలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ అళహరి సుధాకర్‌, జనసైనికులకు కృతజ్ఞతలు తెలిపారు.