Oct 26,2021 20:17

ఈ ఏడాది సంక్రాంతికి చిత్ర పరిశ్రమలో గట్టి పోటీ నెలకొంది. స్టార్‌ హీరోలందరి చిత్రాలు సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే పాన్‌ ఇండియా మూవీస్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'సర్కారు వారి పాట', 'రాధే శ్యామ్‌' సంక్రాంతి బరిలో ఉన్నాయి. అయితే వీరందరికన్నా ముందే 'భీమ్లా నాయక్‌' సంక్రాంతి బరిలో దిగింది. పవన్‌ కళ్యాణ్‌, రానా దగ్గుబాటి మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాగర్‌చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్‌ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. సంక్రాంతికి పాన్‌ ఇండియా సినిమాలు విడుదల అవ్వడంతో భీమ్లా నాయక్‌ వెనక్కి తగ్గనుంది అని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో నిర్మాత నాగవంశీ స్పందించారు. జనవరి 12న థియేటర్లలో తమ సినిమా విడుదల అవుతుందని ట్వీట్‌ చేశారు.