
చందర్లపాడు (కృష్ణా) : మండలంలోని పున్నవల్లి గ్రామంలో మిర్చి రైతులు కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు మాట్లాడుతూ... నల్ల తామర పురుగు వల్ల మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా మిర్చి రైతులకు ఎకరానికి లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఈ క్రాఫ్ట్ నమోదు చేయాలని తదితర డిమాండ్స్ తో జనవరి 21వ తేదీన విజయవాడ అలంకార్ సెంటర్ వద్ద మహాధర్నా కార్యక్రమం చేపట్టనున్నామని మిర్చి రైతులందరూ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి వెంకయ్య, మన్నేపల్లి శ్రీనివాసరావు శ్రీను, వెంకయ్య, పూర్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.