Nov 23,2021 21:19

స్పెక్ట్రమ్‌ ఈక్విటీ నుంచి సమీకరణ
హైదరాబాద్‌ : 
డిజిటల్‌ టాక్స్‌ కాంప్లియెన్స్‌, ఫిన్‌ టెక్‌ సాస్‌ అయినా జెన్‌వర్క్‌ తాజాగా స్పెక్ట్రమ్‌ ఈక్విటీ నుంచి రూ.1200 కోట్లు సమీకరించినట్లు వెల్లడించింది. మంగళవారం హైదరాబాద్‌లో జెన్‌వర్క్‌ సహవ్యవస్థాపకులు, సిఇఒ సంజీవ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ పెట్టుబడి జెన్‌వర్క్‌ తన సంస్థలయినా టాక్స్‌ 1099, కాంప్లియెన్సీ బ్రాండ్లను నిర్వహించేందుకు, వినూత్న ఉత్పత్తుల వేగవంతానికి మద్దతునివ్వనుందని తెలిపారు. అదే విధంగా పవర్‌ ఎలక్ట్రానిక్‌ ఫైలింగ్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి ఆధునిక, ఆటోమేటెడ్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ కోసం పెరుగుతున్న వ్యాపార డిమాండ్‌ను తీర్చేందుకు ఉపయోగించబడుతుందన్నారు. జెన్‌వర్క్‌ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 100,000కు పైగా సంస్థలకు తన సేవలను అందిస్తోందన్నారు. శరవేగంగా వృద్ధి చెందుతూ రెండేళ్లుగా ఏటా 40,000 మంది కొత్త క్లయింట్లను జోడించుకుంటోందన్నారు. లక్షలాది ఎలక్ట్రానిక్‌ ఫైలింగ్స్‌ ను ప్రాసెస్‌ చేస్తోందని.. తన క్లయింట్ల తరఫున ఏటా 1.2 కోట్ల పైగా బిజినెస్‌ ఐడెంటిటీ, కాంప్లియెన్స్‌ తనిఖీలను నిర్వహిస్తోందన్నారు.