Feb 27,2021 01:18

45వ వార్డులో గౌరీష్‌కు హారతులు పడుతున్న మహిళ

జివిఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న సిపిఎం కార్పొరేటర్‌ అభ్యర్థులు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి తాము గెలిస్తే ఏం చేయదలుచుకున్నామో తెలియజేస్తున్నారు. ప్రజల గళం వినిపించేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లును అభ్యర్థిస్తున్నారు.
71వ వార్డులో..
గాజువాక : 71వ వార్డు సిపిఎం పార్టీ అభ్యర్థి ఎం.రాంబాబును గెలిపించాలని దుర్గా నగర్‌ కాలనీలో ఇంటింటా ప్రచారం చేశారు. దుర్గానగర్‌లోని డ్రైనేజీ, కొండవాలు సమస్యల పరిష్కారం కోసం సిపిఎంను గెలిపించాలని కోరారు. రాజు, కృష్ణ, విజరు, శ్రీను మాస్టర్‌, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.
45వ వార్డులో..
సీతమ్మధార : 45వ వార్డు సిపిఎం అభ్యర్థి గౌరీష్‌ను గెలిపించాలని కోరుతూ తాటిచెట్లపాలెం గణేష్‌ నగర్‌, సోనియా గాంధీ నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జోన్‌ కార్యదర్శి ఆర్‌పీ.రాజు మాట్లాడుతూ సీపీఎం గెలిపిస్తే వార్డులో సమస్యల పరిష్కారంతో పాటు విశాఖ ప్రజలపై ప్రభుత్వాలు మోపుతున్న భారాలపై కూడా పోరాడతామని తెలిపారు. నాయకులు కెయస్‌.కుమార్‌, ఆర్‌యన్‌.మాధవి, ఉలవల బాబ్జీరావు, పోర్టు యూనియన్‌ నాయకులు జి.త్రినాథరావు, యం.ప్రదీప్‌ కుమార్‌, మహిళలు పాల్గొన్నారు.
62, 63 వార్డుల్లో...
మూలగాడ : ప్రజలు, కార్మికుల పక్షాన నికరంగా పోరాడుతున్న సిపిఎం అభ్యర్థులు ఎం.జగ్గునాయుడు, పిసిని రామారావును సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని 62, 63 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ వార్డుల పరిధిలోని కాకరలోవ, చింతలలోవ, తెలుగుదేశంకాలని, అంబేద్కర్‌ కాలనీల్లో ఈ ప్రచారం సాగింది. ఇప్పటికే ప్రజా సేవకు అంకితమై పని చేస్తున్న తమను గెలిపిస్తే మరింతంగా పని చేస్తామని చెప్పారు. పూడి పైడిరాజు, తాతబాబు, అర్జునరావు, కృష్ణ, బి.ప్రసాద్‌, యన్‌.శ్రీనివాస్‌, పప్పల భాస్కరరావు, డి.గోపాల్‌, దొడ్డమ్మ, కళ్యాణి, జయలక్ష్మి, ,రాజేశ్వరి, అన్నపూర్ణ, వరలక్ష్మి, అప్పలనర్సమ్మ కె.ఈశ్వరమ్మ, శారద పాల్గొన్నారు.
90వ వార్డులో...
కరాస : 90వ వార్డు సిపిఎం అభ్యర్థి వి.ప్రభావతి బుచ్చిరాజుపాలెంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. స్థానిక సమస్యల పరిష్కారానికి తాను చేసిన పోరాటాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అప్పలనాయుడు, సత్యనారాయణ, సుబ్బారావు, వి.మేరీ, ఎస్‌ సత్యనారాయణ, రమణ పాల్గొన్నారు.
92వ వార్డులో..
గోపాలపట్నం : ప్రజల కోసం నిరంతరం పనిచేసే సిపిఎం అభ్యర్థి పి.సీతారత్నంను గెలిపించాలని, ఆ పార్టీ సీనియర్‌ నాయకులు పి వెంకట్‌ రెడ్డి ప్రజలను కోరారు. 92వ వార్డు పరిధి గణేష్‌ నగర్‌ శ్రీరామ్‌ నగర్‌ ప్రాంతాల్లో పర్యటించి ప్రచారం చేశారు. సిపిఎం నాయకులు బలివాడ వెంకటరావు, ఉరుకూటి రాజు, సీరం పైడిరాజు పాల్గొన్నారు.
97వ వార్డులో..
పెందుర్తి : 97వ వార్డు సిపిఎం అభ్యర్థి బి.అనంతలక్ష్మి ఆంజనేయలునగర్‌, గిరి ప్రసాద్‌ నగర్‌లో విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా అనంతలక్ష్మి మాట్లాడుతూ వార్డు అభివృద్ధి చెందాలంటే అందరం ఐక్యంగా ఉండాలన్నారు. ఐద్వా నాయకులు బి.రమణి, సీఐటీయూ నాయకులు అప్పలరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.
69వ వార్డులో...
గాజువాక : 69వ వార్డు సిపిఎం అభ్యర్థి జి.సుబ్బారావును గెలిపించాలని కోరుతూ తుంగ్లంలో ప్రచారం చేశారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో సుబ్బారావును వార్డులోని పలువురు నేతలు అభినందించారు. సుబ్బారావు గెలుపు 69వ వార్డు అభివద్ధికి నాంది అని పేర్కొన్నారు.