Jul 21,2021 19:17

తమిళ నటుడు ధనుష్‌ తన 43వ చిత్రంలో జర్నలిస్ట్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కార్తిక్‌ నరేన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్‌ కథానాయిక. ఈమె కూడా జర్నలిస్టు పాత్ర పోషిస్తోంది. యాక్షన్‌ థ్రిల్లర్‌ జానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో ధనుష్‌, మాళవికల జోడి అలరిస్తుందని చిత్రబృందం చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లోనే సాగుతోంది. ఇటీవలే మాళవిక మోహనన్‌ తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలు పూర్తి చేసింది. హాలీవుడ్‌ చిత్రం 'గ్రేమ్యాన్‌' పూర్తి చేసుకొని వచ్చిన ధనుష్‌ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.