May 13,2022 22:08

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఇజ్రాయెల్‌ సైనిక బలగాలు జర్నలిస్టు షిరీన్‌ అబు అక్లేహ్ హత్య చేయడాన్ని ఖండిస్తూ అఖిల భారత శాంతి, సద్భావన సంస్థ (ఎఐపిఎస్‌ఓ) తీవ్రంగా ఖండించింది. న్యూఢిల్లీలోనికనాుట్‌ ప్లేస్‌లో ఆ సంస్థ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఇజ్రాయెల్‌ దళాలచే అక్లేహ్ ను చంపడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని ఎఐపిఎస్‌ఓ పిలుపునిచ్చింది. పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ ఆక్రమణను తక్షణమే ముగించాలని, 1967 సరిహద్దులతో, తూర్పు జెరూసలేం రాజధానిగా ఉన్న పాలస్తీనాను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేసింది.
ఈ సందర్భంగా ఎఐపిఎస్‌ఓ ప్రధానకార్యదర్శి ఆర్‌. అరుణ్‌ కుమార్‌ మాట్లాడుతూ జర్నలిస్టు హత్యపై నిష్పాక్షిక విచారణ జరిపి, ఈ దారుణ హత్యకు కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ కూడా ఈ క్రూరమైన హత్యను ఖండించారని, స్వతంత్ర విచారణకు డిమాండ్‌ చేశారని గుర్తు చేశారు. యుఎస్‌ పౌరురాలైన షిరీన్‌ అబు అక్లే పాలస్తీనా కవరేజీకి చిహుంగా నిలిచిందని, ఇజ్రాయెల్‌ ఆక్రమణ దళాల క్రూరమైన చేష్టలను, పాలస్తీనియన్లపై వారు చేస్తున్న అకృత్యాలను నిజాయితీతో ప్రపంచానికి నివేదించిందని తెలిపారు. దీంతో ఆమె ఇజ్రాయెల్‌ దాడికి గురి అయిందని, ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు తన బాధ్యతను స్వీకరించడానికి బదులు, హత్యకుపాలస్తీనియన్లపై నిందలు మోపడం హేయమైనదని విమర్శించారు. పాలక శక్తులు వాస్తవ ప్రాతినిధ్యంతో ఇబ్బంది పడుతున్నప్పుడల్లా చాలా చోట్ల జరులిస్టులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన దాడిగా, అబూ అక్లేపై జరిగిన దాడినిచూడాలని అన్నారు. జర్నలిస్టులపై మితవాద, నిరంకుశ శక్తులు చేస్తును దాడులకుభారతదేశం కూడా సాక్షిగా ఉందనివిమర్శమచారు. అబూ అక్లేహ్ ను హతమార్చిన శక్తులు, జరులిస్టులపై దాడులకు నాయకత్వం వహించిన దేశంలోని హిందుత్వ మతతత్వ శక్తులు లోతైన సైద్ధాంతిక అనుబంధానిు, స్నేహాన్ని పంచుకోవడం యాదృచ్ఛికం కాదని పేర్కొన్నారు. ఎఐపిఎస్‌ఓ ప్రధాన కార్యదర్శి పల్లాబ్‌ సేన్‌గుప్తా, కార్యదర్శి డాక్టర్‌ ఖాన్‌ కూడా ప్రసంగించారు. ఈ నిరసనలో విద్యార్థి సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్కర్ష్‌, విద్యార్థులు, మహిళలు, శాంతికాముకులు పాల్గొన్నారు.