
ప్రజాశక్తి-వన్‌టౌన్: కాకినాడ పి.ఆర్ గవర్నమెంట్ కళాశాలలో డిసెంబర్ 3,4 తేదిలలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి జూడో చాంపియన్ షిప్ కాంపీటీషన్స్-2022 పోటీలలో విజయవాడ పొట్టి శ్రీరాములు చలువాది మల్లిఖార్జునరావు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని తన సత్తాను చాటుకొని కళాశాల గౌరవాన్ని చాటి చెప్పింది. ఇసిఇ విభాగం ద్వీతీయ సంవత్సరం విద్యార్ధినీ కష్ణవరపు అలేఖ్య రాష్ట్ర స్థాయిలో (-78 వెయిట్ కేటగీరిలో) ద్వితీయ స్థానం కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా కళాశాలలో మంగళవారం విద్యార్థినిని అభినందన కార్యక్రమం నిర్వహించారు. అలేఖ్యను కళాశాల యాజమాన్యం, సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ పి.లక్షణస్వామి, ప్రిన్సిపాల్ డాక్టరు జె.లక్ష్మినారాయణ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.పతాంజలి శాస్త్రి , కళాశాల ప్లేస్మెంట్ డైరెక్టర్ యస్.మణికంఠ, ఫిజికల్ డైరెక్టర్ యం.వికట్ జాన్సన్ తదితరులు అభినందించారు.