Oct 19,2020 20:20

వాతావరణ కాలుష్యం, అధిక ఒత్తిళ్లతో జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. జుట్టు చిట్లిపోవడం, తెల్లబడటం, చుండ్రు లాంటి సమస్యలు తరుచూ ఎదురౌతుంటాయి. వీటిని ఇంట్లో ఉండే పదార్థాలతో పరిష్కరించుకోవచ్చు.
- ఉల్లిగడ్డను మొత్తగా మిక్సీ పట్టి తీసిన రసాన్ని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే సరిపోతుంది. జట్టు పెరిగేందుకు దోహదపడుతుంది.
- కొబ్బరినూనెలో ఉల్లిగడ్డ ముక్కలు వేసి గోరువెచ్చగా వేడిచేయాలి. దీన్ని రోజుమార్చి రోజూ జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. దీంతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఉడిపోవడం తగ్గుతుంది.
- ఉల్లిలో ఉండే మెలనిన్‌ వెంట్రుకలు తెల్లబడకుండా దోహదపడుతుంది.
- ఉల్లిలో ఉండే సల్ఫర్‌ జుట్టు చిట్లిపోవడాన్నీ, సన్నగా మారడాన్ని అడ్డుకుంటుంది.
- ఉల్లికి రక్త ప్రసరణను మెరుగు పరిచే గుణాలున్నాయి. ఉల్లిరసం వల్ల జుట్టు మెరుస్తూ ఉంటుంది.
-  కరివేపాకులో కార్బోహైడ్రేట్లు, శక్తి, ఫైబర్‌, కాల్షియం, ఫాస్పరస్‌, ఇనుము, మెగ్నీషియం, రాగి, ఖనిజాలున్నాయి. కరివేపాకు పొడిగా చేసి కొబ్బరినూనెతో కలిపి నిల్వ పెట్టుకోవాలి. దీన్ని ప్రతిరోజూ జుట్టుకు రాయడం వల్ల తెల్లజుట్టు సమస్య తగ్గుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుది.
- గోరింటాకులో యాంటిబయాటిక్‌లు ఉన్నాయి. తలకు గోరింటాకు రసాన్ని మర్ధనా చేస్తే మంచిది. శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. చుండ్రు సమస్య తగ్గుతుంది. పేలు సమస్య కూడా తొలగిపోతుంది.