Jun 02,2023 12:29

వాషింగ్టన్‌  :   అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కిందపడిపోయారు. కొలరాడోలోని  అమెరికా వైమానిక దళ అకాడమీలో గురువారం గ్రాడ్యుయేషన్‌ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గన్న బైడెన్‌ ప్రారంభ ప్రసంగం చేసిన అనంతరం క్యాడెట్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చారు. అనంతరం తన సీటుకు వెళుతుండగా ఒక్కసారిగా కాలు స్లిప్‌ అయ్యి కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన్ను పైకి లేపారు. అనంతరం బైడెన్‌ తన సీటు వద్దకు వెళ్లి కూర్చున్నారు. ఈ ఘటనలో అధ్యక్షుడికి ఎలాంటి గాయాలూ కాలేదని వైట్‌హౌస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. బైడెన్‌ కిందపడిపోయిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇటీవల విదేశీ పర్యటకు వెళ్లిన బైడెన్‌ తిరుగు ప్రయాణంలో ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ ఎక్కుతూ మెట్లపై జారిపడిన సంగతి తెలిసిందే.

 

;