Nov 25,2022 16:17

ప్రజాశక్తి-అడ్డతీగల :  స్థానిక మండల కేంద్రంలో గల అనంత చక్ర రావు జూనియర్ కాలేజీ వద్ద మైదాన ప్రాంతాన్ని అన్యక్రాంతమవుతున్నట్లుగా అల్లూరి జిల్లా కలెక్టర్ కు అందిన ఫిర్యాదు మేరకు రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం బన్సల్ గురువారం సాయంత్రం చేసిన పర్యటనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం నుండి అడ్డతీగల రెవెన్యూ అధికారులు సర్వే గోవిందరాజులు ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడం జరిగింది. దీనిపై పూర్తి నివేదిక రంపచోడవరం సబ్ కలెక్టర్ కి ఈరోజు సాయంత్రం 6 గంటలకు పూర్తి నివేదిక ఇవ్వడం జరుగుతుందని సర్వే గోవిందరాజులు తెలిపారు.