Jun 02,2023 12:04

వాషింగ్టన్‌  :  వచ్చే ఏడాది జరగనున్న జాతీయ ఎన్నికల్లో బిజెపిని గద్దె దించుతామని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. భారత్‌లో ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ఉన్నాయని అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌.. గురువారం వాషింగ్టన్‌లోని నేషనల్‌ ప్రెస్‌ క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ పార్టీ మరింత బలోపేతం అవుతుందని తాను విశ్వసిస్తున్నానని అన్నారు. ప్రతిపక్ష కూటమి బిజెపిని ఓడిస్తుందని అన్నారు. వచ్చే ఏడాది ఎన్నికల కోసం కాంగ్రెస్‌ ఇతర ప్రతిపక్ష పార్టీలతో విస్తృతంగా చర్చలు జరుపుతోందని అన్నారు.  దేశంలోని అన్ని సంస్థలపై మోడీ ప్రభుత్వం నియంత్రణ ఉందని, మీడియాపైనా నిర్బంధం ఉందదని అన్నారు.