Nov 24,2022 07:06

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సుప్రీంకోర్టు పనితీరు మరింత సజావుగా, సాఫీగా సాగేందుకు వీలుగా నాలుగు అంశాలపై విచారణ చేపట్టేందుకు నాలుగు ప్రత్యేక ధర్మాసనాలను ఏర్పాటు చేస్తున్నామని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ తెలిపారు. బుధవారం ఆయన సుప్రీం కోర్టులో ఈ విషయాన్ని వెల్లడించారు. క్రిమినల్‌ అంశాలు, ప్రత్యక్ష-పరోక్ష పన్నుల అంశాలు, భూసేకరణ, మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్స్‌ ట్రిబ్యునల్‌ కేసులపై ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక ధర్మాసనాలు వచ్చే వారం నుంచి విచారణ ప్రారంభిస్తాయని తెలిపారు. భూసేకరణ వ్యవహారాలకు సంబంధించిన ధర్మాసనానికి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వం వహిస్తారని సిజెఐ చెప్పారు.