Oct 05,2022 12:49

ప్రజాశక్తి-ఉదయగిరి : నెల్లూరు జిల్లా ఉదయగిరి సర్కిల్ కార్యాలయంలో ఉపాధ్యాయులు రచయిత జ్యోతి శ్రీనివాస్ రచించిన ప్రిఫెక్స్ విత్ వెర్బ్స్ ఇంగ్లీష్ పుస్తకాన్ని సిఐ వి.గిరిబాబు ఎస్ఐ అంకమ్మ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత జ్యోతి శ్రీనివాస్ మాట్లాడుతూ వెనుకబడిన ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క ప్రతి విద్యార్థి యువత పోటీ పరీక్షలు ఎదుర్కొనేందుకు ఇంగ్లీష్ ను సులువుగా అర్థమయ్యే విధానంలో ఈ పుస్తకంను రచించడం జరిగిందన్నారు. ఇంగ్లీష్ రాదు నేర్చుకోలేము అనే వారికి ఓ మంచి పుస్తకం అని ప్రతి ఒక్కరకు ఉపయోగపడుతుందన్నారు. ముందుగా సిఐ గిరిబాబు ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో విధులు నిర్వహించేందుకు విజయదశమి సందర్భంగా కార్యాలయంలో ఆయుధపూజ నిర్వహించారు. సర్కిల్ పరిధిలోని ప్రజలు కూడా పాడిపంటలతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.