Jul 29,2021 19:39

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' చిత్రం హైదరాబాద్‌ నుంచి కాకినాడ లొకేషన్‌కు షిఫ్ట్‌ అవుతున్నట్లు తెలుస్తోంది. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌, పూజా హెగ్డే కీలక పాత్రధారులు. కాకినాడలో జరుగుతున్న తాజా షెడ్యూల్‌ మూడు నుంచి ఐదు రోజులు జరగనుంది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ముఖ్యంగా చిరంజీవి, సోనూసూద్‌ కాంబినేషన్‌లో సీన్స్‌ తెరకెక్కిస్తారని సమాచారం.