Jan 19,2022 10:32

శ్రీకాకుళం : శ్రీకాకుళంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. రామచంద్రాపురం సర్పంచ్‌ వెంకటరమణమూర్తిపై మంగళవారం అర్థరాత్రి దుండగులు కాల్పులు జరిపారు. తూటాలు వెంకటరమణ పొట్టను రాసుకుంటూ వెళ్లిపోవడంతో ప్రమాదం తప్పింది. మరురానగర్‌లోని సర్పంచ్‌ కార్యాలయానికి ఆదివారంపేటకు చెందిన ఓ మహిళ రాత్రి వెళ్లింది. ఆమెతోపాటు మరో ఇద్దరిని వెంటతీసుకెళ్లింది. వీరి మధ్య సంభాషణలు జరుగుతుండగా ఆమెతో వచ్చిన వ్యక్తులు సర్పంచ్‌పై తుపాకితో రెండుసార్లు కాల్పులు జరిపి అక్కడ నుంచి పరారయ్యారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.