Aug 07,2022 22:19

ఫొటో : కామాక్షితాయిని దర్శించుకుంటున్న తెలంగాణ హైకోర్టు జడ్జి

ఫొటో : కామాక్షితాయిని దర్శించుకుంటున్న తెలంగాణ హైకోర్టు జడ్జి
కామాక్షితాయి సేవలో తెలంగాణ హైకోర్టు జడ్జి
ప్రజాశక్తి-బుచ్చిరెడ్డిపాలెం : జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జొన్నవాడ శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్‌ పి.శ్రీసుధా ఆదివారం దర్శించుకున్నారు. దేవస్థానం చైర్మన్‌ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, ఇఒ డుబ్బుగుంట వెంకటేశ్వర్లు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
అనంతరం ఆయన గోత్ర నామాలతో స్వామి, అమ్మవార్ల వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వారికి అమ్మవారి శేష వస్త్రం, ప్రసాదాలు అందజేశారు. ఆయనవెంట జిల్లా ప్రొటోకాల్‌ జడ్జీ కేపీ సాయిరాం తదితరులు ఉన్నారు.