Jul 20,2021 07:59

చదువులలో మేము
చిచ్చు బుడ్డులం

ఆట,పాటలలో మేము
తారా జువ్వలం

మాటలలో మేము
మతాబులం

బుద్ధిలో మేము
బురుసు చక్రాలం

అల్లరిలో మేము
ఆటం బాంబులం

మంచితనంలో మేము
మైనపొత్తులం

క్రమశిక్షణలో మేము
నూనె దీపాలం

చీకటిలో మేము
కాంతి రేఖలం

ప్రతి ఇంట మేము
జిలుగు వెలుగులం

- కయ్యూరు బాలసుబ్రమణ్యం
9441791239