Apr 07,2021 15:10

అమరావతి : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ మంగళవారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంకు చెందిన కానిస్టేబుల్‌ కార్యనిర్వహణలో భాగంగా తమిళనాడులో ఓటింగ్‌ బూత్‌ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. అయితే అక్కడ ఓ మహిళ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి తన నెలరోజుల నవజాత శిశువును తీసుకొని పోలింగ్‌ బూత్‌ వద్దకు చేరారు. ఆ సమయంలో శిశువు ఏడుస్తుండడంతో... అది విన్న కానిస్టేబుల్‌ బేబీని తన దగ్గరికి తీసుకున్నారు. తల్లి ఓటు వేసి వచ్చేవరకూ... ఆ శిశువును ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ బేబీని దగ్గరకు తీసుకుని... తానే అమ్మయ్యాడు. అతనిలోని మాతృహృదయాన్ని గమనించిన ఓ కెమెరా క్లిక్‌మనిపించింది. ఈ ఫొటోను ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ విభాగం అధికారిక ట్విటర్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. అలా సానుభూతి చూపించిన కానిస్టేబుల్‌ని కొంతమంది నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరికొంతమందేమో.. ఎపి పోలీస్‌ డిపార్టుమెంట్‌ని అభినందిస్తున్నారు.