
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పాడి కౌశిక్‌రెడ్డి టిఆర్ఎస్లో చేరారు. బుధవారం కౌశిక్‌రెడ్డికి కండువా కప్పిన సిఎం కెసిఆర్.. పార్టీలోకి ఆహ్వానించారు. హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన 'టిఆర్ఎస్ టికెట్ తనకేనంటూ ఓ నాయకుడితో ఆడియో సంభాషణ' బయటపడిన తరువాత పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన అనుచరులు, అభిమానులతో సంప్రదింపులు జరిపిన తరువాత టిఆర్ఎస్లో చేరిపోయారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని కౌశిక్‌రెడ్డి తమ పార్టీలోకి వచ్చారని, యువనేత టిఆర్ఎస్లో చేరడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.