Nov 30,2022 22:49

బేవరేజ్‌ కార్మికులతో కలిసి ధర్నా చేస్తున్న స్వరూపరాణి

- సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వరూపారాణి
ప్రజాశక్తి -సామర్లకోట
కార్మికుల న్యాయమైన డిమాండ్లను తీర్చే బాధ్యత ప్రభుత్వం పైనే ఉందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.స్వరూప రాణి అన్నారు. బుధవారం స్థానిక ఐఎంఎల్‌ డిపో ఎదుట బేవరేజెస్‌ హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విప్పర్తి కొండలరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వరూపరాణి మాట్లాడుతూ కార్మికులు రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర ధరలకు అను గుణంగా మాత్రమే బాక్స్‌కు రూ.3 అడిగారని దీనిని కూడా ప్రభుత్వం గానీ సిగ్మా కంపెనీ యాజమాన్యం గాని ఎందుకు పట్టించుకోవడం లేదో తెలపాలని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న కార్మికులకు మాత్రం న్యాయం చెయ్యకపోవడం దారుణమని అన్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి స్పందించి కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లను అంగీకరించాలని డిపోలలో కార్మికులకు అవసరమైన సౌకర్యాలను కల్పిం చాలని ఆమె డిమాండ్‌ చేశారు. లేకుంటే సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బాలం శ్రీనివాస్‌, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కరణం ప్రసాద్‌ రావు యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు నాళం సత్యనారాయణ, నారపాటి వీరప్పారావు ఉపాధ్యక్షులు బుర్రే ఆదినారాయణ, వి. అప్పలరాజు నాళం సత్యనారాయణ పప్పు సత్తిబాబు, వెన్నెల గోవింద్‌, నాళం తిరుమల రావు, నక్క ఈశ్వరవు, ఎ అర్జున్‌, బర్రే శ్రీనివాసు, వీర అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు.