
పుట్టపర్తి అర్బన్ : సత్యసాయి జిల్లా కేంద్రంలో కమ్యూనిస్టు నాయకురాలు దేశిరెడ్డి నాగమ్మ పేరుతో నిర్మిస్తున్న కార్మిక, కర్షక భవన నిర్మాణాన్ని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి.రాఘవులు పరిశీలించారు. మంగళవారం కదిరి కోర్టులో వాయిదా నిమిత్తం వచ్చిన ఆయన భవన నిర్మాణాన్ని పరిశీలించి, సిపిఎం నాయకులకు పలు సూచనలు చేశారు. నూతన జిల్లా కేంద్రంలో కార్మిక కర్షక కేంద్రం బుక్కపట్నం దేశి రెడ్డి నాగమ్మ పేరుతో నిర్మిస్తుండడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో మహిళ కమ్యూనిస్టు నాయకురాలుగా నాగమ్మ ఉద్యమాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఈ భవన నిర్మాణం పూర్తి అయితే కార్మికులు, కర్షకులు సిపిఎం సమావేశాలు ఇందులోనే జరుపుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం అనంతపురం జిల్లా కార్యదర్శి రాంభూపాల్, సత్యసాయి జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్, నాయకులు ఈఎస్.వెంకటేష్, పైపల్లి గంగాద్రి, బ్యాళ్ల అంజి, గౌస్ లాజాం, బాబావలి, నాగరాజు, గంగాద్రి తదితరులు పాల్గొన్నారు.