
ప్రజాశక్తి-చీమకుర్తి : కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గ్రానైట్ కార్మికులు ఐక్యంగా పోరాటాలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి జి. శ్రీనివాసులు తెలిపారు. స్థానిక దాచూరిరామిరెడ్డి భవనంలో గ్రానైట్‌రంగంలో నాయకత్వ శిక్షణా తరగతులు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రానైట్ రంగంలో కార్మికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటు న్నారన్నారు. యజమానులు కార్మికుల శ్రమతో కోట్లరూపాయలు కూడబెట్టి కార్మికుల వేతనాలు పెంచ కుండా, కార్మిక చట్టాలు అమలు చేయకుండా ,నెలానెలా వేతనాలు ఇవ్వకుండా బకాయీలు పెడుతున్నారన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు యజమానులకు అనుకూలంగా చట్టాలు మార్పు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రానైట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఆర్. ఆంజనేయరెడ్డి, సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు బి. వీరాంజనేయులు, పల్లాపల్లి ఆంజనేయులు, జిల్లా నాయకులు పూసపాటి వెంకటరావు,గ్రానైట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఓబులేషు, లక్ష్మినారాయణ ,శంకర్, కనకరాజు,శ్రీను, నాగయ్య,పాండు, వాలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.