May 04,2021 13:02

కారంచేడు (ప్రకాశం) : కారంచేడు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో కోవిడ్‌ పై అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు. కరోనా నియంత్రణ చర్యలపై గ్రామ సచివాలయ సిబ్బంది, ఆరోగ్య సిబ్బందితో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పర్చూరు వైసిపి ఇంచార్జ్‌ రామనాధంబాబు మాట్లాడుతూ... అన్ని శాఖల అధికారులు కోవిడ్‌ను ఎదుర్కోవడానికి సమన్వయంతో పనిచేయాలి అన్నారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఎం.వెంకటేశ్వర్లు కారంచేడు మండలంపరిధిలోని అన్ని సచివాలయాలకు సంబంధించిన కోవిడ్‌ నియంత్రణ దస్త్రాలను పరిశీలించారు. సచివాలయం -3 పరిధిలో అత్యధికంగా కోవిడ్‌ కేసులు నమోదవ్వడంతో సచివాలయ పరిధిలో శానిటేషన్‌, ఫీవర్‌ సర్వే, ఫీవర్‌ క్లీనిక్‌ నిర్వహణ వివరాలను అడిగి తెలుసుకొని కేసుల నియంత్రణకు సూచనలు తెలిపారు. ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌ ప్రజలకు కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ పై అవగాహన కలిగించి స్వీయ నియంత్రణ పాటించేలా చేయాలని సభలో పాల్గనవారందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి రావి రామనాధం బాబు, పర్చూరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఎం.వెంకటేశ్వర్లు, మండల ఎస్సై తహసీల్దారు ఎంపిడిఒ ఈ.వో, గ్రామ పంచాయతీ కారంచేడు వార్డు సభ్యులు, సచివాలయ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, వాలంటీర్లు, మండల వైసిపి నాయకులు పాల్గొన్నారు.