May 17,2022 22:19

కారులో మంటలు చెలరేగుతున్న దృశ్యం

భాకరాపేటవాసులుగా గుర్తింపు
ప్రజాశక్తి - పీలేరు

కారు టైరు పేలి ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢకొీన్న ప్రమాదంలో కారులో మంటలు చెలరేగి ముగ్గురు యువకులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాళెం సమీపంలో చోటు చేసుకుంది. మృతులు ముగ్గరూ తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట వాసులుగా గుర్తించారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనా వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి.
తిరుపతి జిల్లా, భాకరాపేట నుంచి శ్రీశైలం వెళుతున్న కారును విజయవాడ నుంచి బెంగళూరు వెళుతున్న కంటైనర్‌ లారీ ఢకొీంది. ఈ ఘటనలో కారు షార్ట్‌ సర్క్యూట్‌కు గురి కావడంతో భాకరాపేట టీచర్స్‌ కాలనీకి చెందిన రేవూరి భాస్కర్‌ కుమారుడు రేవూరి రవితేజ (28) డ్రైవింగ్‌ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదే ప్రమాదంలో భాకరాపేట సందు వీధికి చెందిన పఠాన్‌ మస్తాన్‌ కుమారుడు పఠాన్‌ ఇమ్రాన్‌ (21), సకిరి సత్యనారాయణ కుమారుడు సకిరి బాలాజీ (21) ఉన్నారు. విషయం మీడియా ద్వారా తెలియడంతో భాకరా పేటలో విషాద ఛాయలు నెలకొన్నాయి. సమాచారం కోసం బాధిత కుటుంబీకులు, బంధువులు వారికి తెలిసిన విభిన్న మార్గాల్లో ప్రయత్నిస్తుండడం గమనార్హం.