May 17,2022 22:07

ప్రజాశక్తి-మార్కాపురం :ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. టైరు పేలి కారు అదుపు తప్పి ఓ కంటైనర్‌ను ఢకొీన్నడంతో మంటలు వ్యాపించాయి. కారులోని ముగ్గురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. పోలీసుల సమాచారం మేరకు..ప్రకాశం జిల్లా కంభం నుంచి ముగ్గురు వ్యక్తులు కారులో శ్రీశైలానికి బయలుదేరారు. తిప్పాయపాలెం సమీపానికి రాగానే కారు టైరు పేలిపోయింది. దీంతో అదుపు తప్పి సుమారు 50 మీటర్ల వరకూ దూసుకెళ్లింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢకొీట్టింది. కారు పెట్రోలు ట్యాంకు పేలడంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. దీంతో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులోని ముగ్గురు వ్యక్తులు సజీవదహనయ్యారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కారు డ్రైవర్‌ను చిత్తూరు జిల్లా భాకరాపేటకు చెందిన రావూరి తేజగా గుర్తించారు. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.