Jul 03,2022 22:54

ప్రజాశక్తి - చాట్రాయి
              ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని టిడిపి మండల అధ్యక్షులు మరిడి వెంకటేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని చాట్రాయి, మర్లపాలెం, నరసింహారావుపాలెం, చనుబండ గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న టిడిపి కార్యకర్తలకు పార్టీ నేతలు ఆదివారం రూ.1,60,000 ఆర్థిక సాయం అందించారు. పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వరరావు, అధికార ప్రతినిధి మందపాటి బసవారెడ్డి, తెలుగు రైతు నాయకులు నోబుల్‌ రెడ్డి, మండల కార్యదర్శి కంచర్ల హనుమంతరావు, చాట్రాయి మాజీ సర్పంచి కోట జోషి, చాట్రాయి గ్రామ అధ్యక్ష కార్యదర్శులు గడ్డం ప్రభాకర్‌ రెడ్డి, కంపసాటి శంకర్‌రావు, మండల తెలుగు యువత అధ్యక్షులు బొంతు సతీష్‌, నూజివీడు నియోజకవర్గ గౌడ సంఘ నాయకులు కందుల కృష్ణ, పార్టీ నాయకులు మహేశ్వర రావు, ప్రదీప్‌ కుమార్‌, బొట్టు దుర్గారావు, మరికొందరు నేతలు మండలంలోని గ్రామాల్లో పర్యటించి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.