Oct 28,2021 09:33

బెంగళూరు : పాము కాటేస్తే ఏం చేస్తాం.. ముందు భయపడిపోయి..తర్వాత ఆసుపత్రికి పరుగుతీస్తాం. అంతేకానీ పామును చంపి.. దాన్ని కూడా హాస్పిటల్‌కు తీసుకెళ్లం కదా.. కానీ కర్ణాటకలో ఇలానే జరిగింది. డెంకణీ కోట గ్రామానికి చెందిన మణి అనే మహిళకు సంచన శ్రీ కూతరు ఉంది. సంచన శ్రీ ఇంటి ముందు ఆడుకుంటుండగా కట్లపాము జాతికి చెందిన ఓ చిన్న పాము కాటేసింది. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు.. పామును కొట్టి సంచిలో వేశారు. తర్వాత చిన్నారిని డెంకణీ కోట ప్రభుత్వ తీసుకెళ్లగా.. సంచిలో నుండి పామును కూడా తీసి చూపించడంతో వైద్యులు సైతం భయపడ్డారు. ఆ తర్వాత చిన్నారికి వైద్యం అందించడంతో బ్రతికి బయటపడింది.