Jan 13,2021 18:38

కన్నడ నటుడు ఉపేంద్ర నటించిన సినిమా 'కబ్జా' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను ఏడు భాషల్లో విడుదల చేయబోతున్నారు. విడుదల దగ్గర పడుతుండడంతో సినిమాపై ఆసక్తి పెంచేందుకు చిత్ర యూనిట్‌ కొత్త కసరత్తు ప్రారంభించింది. తాజాగా ఉపేంద్రతో పాటు మరో స్టార్‌ హీరో కూడా నటించాడని చిత్ర యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా ఆ విషయాన్ని ప్రకటించబోతున్నట్లుగా పోస్టర్‌ను విడుదల చేశారు.