
రొళ్ల స్టేషన్‌లో సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ మాధవరెడ్డి
రొళ్ల : పెండింగ్ కేసులపై నిర్లక్ష్యం చేయకుండా వాటి పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎస్పీ మాధవరెడ్డి పోలీసు సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల కేసులకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించి, వాటి పురోగతిపై సిఐ సురేష్‌బాబు, ఎస్‌ఐ వెంకటరమణతో మాట్లాడారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్ పరిధిలో వచ్చే కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఆంధ్ర, కర్నాటక సరిహద్దుల్లో మరింత నిఘా పెంచాలన్నారు. మట్కా. మద్యం, అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.