Jul 29,2021 19:44

కన్నడ హీరో యష్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో వస్త్తున్న 'కెజిఎఫ్‌' సీక్వెల్‌ 'కెజిఎఫ్‌ 2'. గురువారం సంజరు దత్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో అధీరాగా విలన్‌ పాత్రలో నటిస్తున్న ఆయన న్యూలుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. చేతిలో భారీ ఖడ్గంతో పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాడు సంజరుదత్‌. ఈ సినిమాను ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.