Apr 24,2021 11:53

కెనాడా : కెనడా లో తెలుగు అలయన్సెస్‌ ఆఫ్‌ కెనడా (తాకా) ఏప్రిల్‌ 17, 2021 శనివారం నాడు ప్లవ నామ సంవత్సర ఉగాది సంబరాలను అంతర్జాలంలో అంగ రంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 500 మందిపైగా కెనడాలోని తెలుగువారు పాల్గని విజయవంతం చేశారు. సాంస్కఅతిక కార్యదర్శి వాణి జయంతి, వ్యవస్థాపక సభ్యులు అరుణ్‌ లయం వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

కెనడాలో అంగరంగ వైభవంగా ఉగాది ఉత్సవాలు


   మొదటగా తాకా సాంస్కృతిక‌ కార్యదర్శి వాణి జయంతి కుటుంబం జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది సంబరాలను ప్రారంభించారు. తరువాత కెనడా, భారతదేశ జాతీయ గీతాలను ఆలపించారు. టరంటో లో ఉన్న తెలుగు పూజారి నరసింహాచార్యులు పంచాంగ శ్రవణం చదివి, కొత్త సంవత్సర రాశి ఫలితాలను అందరికి వివరించారు. తాకా అధ్యక్షులు శ్రీనాథ్‌ కుందూరి అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి కోవిద్‌-19 కష్టకాలంలో తాకా చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు గురించి వివరించారు
   తాకా వ్యవస్థాపక చైర్మన్‌ చారి సామంతపూడి కెనడా లో తెలుగు వారందిరికి ఎన్నో సేవలు అందిస్తున్న అల్బెర్టా మంత్రి పాండా ప్రసాద్‌ కి, సన్‌ డైన్‌ అధినేత శ్రీధర్‌ ముండ్లూరు కి, టరంటో తెలుగు టైమ్స్‌ అధినేత సర్దార్‌ ఖాన్‌ కి ఉగాది పురస్కారాలను ప్రకటించి వారి సేవలను కొనియాడారు.
   మన తెలుగు చలన చిత్ర గాయకుడు దినకర్‌ కల్వల ఎన్నో మంచి పాత, కొత్త తెలుగు సమ్మేళన పాటలను పాడి కార్యక్రమంలో పాల్గొన్న‌ వారందిరిని అలరించారు. తరువాత మాన్వి కార్యంపూడి, సంజిత చల్ల, సీత మైలవరపు, దుర్గ మైలవరపు, ఆశ్రిత పొన్నపల్లి, పూష్ని కోట్ల, శ్రిష్టి దామెరశెట్టి, తారుణి దేసు,మేధా గేదెల, శ్రీ వత్స సంక ,శ్లోక కేశర్వాణి, అజరు అనమంగండ్ల, సంయుత గందె, సాయిశ్రీ పులివర్తి, సహస్ర కోట, వైభవ్య కుప్పం, హరిలౌక్య కుప్పం, రోహన్‌ ముటుపూరుల పాటలు, నఅత్యాలు అందరిని ఎంతో ఉత్తేజపరిచాయి.
   ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన డైరెక్టర్లు మల్లికార్జునచారి పదిర, ప్రవీణ్‌ పెనుబాక, రాజారామ్‌ మోహన్‌ రారు పుల్లంశెట్టి, కోశాధికారి సురేష్‌ కూన, కల్చరల్‌ సెక్రటరీ వాణి జయంతి, వైస్‌ ప్రెసిడెంట్‌ కల్పనా మోటూరి, కార్యదర్శి నాగేంద్ర హంసాల ట్రస్ట్‌ సభ్యులు బాషా షేక్‌, రామ చంద్రరావు దుగ్గిన, రాఘవ్‌ అల్లం, రాణి మద్దెల, ప్రసన్న తిరుచిరాపల్లిని, ఇతర వ్యవస్థాపక సభ్యులు రవి వారణాసి, రమేష్‌ మునుకుంట్ల, రాకేష్‌ గరికపాటి, లోకేష్‌ చిల్లకూరు, మునాఫ్‌ అబ్దుల్‌ ను తాకా అధ్యక్షులు శ్రీనాథ్‌ కుందూరి అభినందించారు. చివరిగా ట్రస్టీ చైర్మన్‌ బాషా షేక్‌ ఈ కార్యక్రమంలో పాల్గన్నవారందిరికి, దాతలకు, అతిధులకు ఇచ్చిన వందన సమర్పణతో కార్యక్రమం జయప్రదంగా ముగిసింది.