Oct 03,2022 23:24

జెండా ఆవిష్కరణలో పాల్గొన్న నాయకులు

తర్లుపాడు : కెవిపిఎస్‌ 24వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎస్‌సి కాలనీలో కెవిపిఎస్‌ జెండాను కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు జవ్వాజి రాజు సోమవారం ఎగుర వేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ఎస్‌సిలు తమ సమస్యలను పరిష్కరించుకొనేందుకు కెవిపిఎస్‌ నిత్యం అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో రాజేంద్ర, యిర్మియా, ప్రసాద్‌, ఆశీర్వాదం, జాన్‌ పాల్గొన్నారు.