Mar 02,2021 12:34

అనంతపురం : ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన శిఖరంగా ఖ్యాతిగాంచిన కిలిమంజారో పర్వతాన్ని తొమ్మిదేళ్ల చిన్నారి రిత్విక గత శుక్రవారం అధిరోహించింది. పర్వతం శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత జాతీయ జెండాతోపాటు కలెక్టర్‌ గంధం చంద్రుడు ఫొటోను చిన్నారి ప్రదర్శించింది. కాగా, అనంతపురం జిల్లాకు తాడిమర్రి మండలం ఎం. ఆగ్రహానికి చెందిన కడపల శంకర్‌ కుమార్తె రిత్విక. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రిత్విక అరుదైన రికార్డుకు దూరమవుతున్నట్లు తెలుసుకున్న కలెక్టర్‌ గంధం చంద్రుడు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రూ.2,98,835 ఆర్థిక సాయాన్ని అందేలా చేశారు. అలాగే రికార్డుల సాధనకు బయలుదేరిన చిన్నారి పట్ల ప్రత్యేకశ్రద్ధను కనబర్చి కలెక్టర్‌ ఎప్పటికప్పుడు సమాచారాన్ని రాబట్టుకోవడం విశేషం.