
కింజరాపు, సోమిరెడ్డి జన్మదిన వేడుకలు
ప్రజాశక్తి-ఉదయగిరి : టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకటరామారావు ఆదేశాలతో కింజరాపు అచ్చెంనాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను మండల అధ్యక్షులు చింతనబోయిన బయన్న మండల నాయకులతో ఘనంగా నిర్వహించారు. ఆదివారం స్థానిక బస్టాండ్ సెంటర్లో వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ మాజీ ఎంఎల్‌ఎ, టిడిపి ఇన్‌ఛార్జి బొల్లినేని వెంకట రామారావు ఆదేశాలతో రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెంనాయుడు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను మండల నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించనున్నారు. ముందుగా టిడిపి కార్యాలయంలో కేక్ కట్ చేసి ఇరువురు నేతలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కేకు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఇటీవల జరిగిన ఎంఎల్‌సి శాసనమండలి కోటా శాసనసభ్యుల ఎన్నిక ల టిడిపి విజయాలు రాబోయే ఎన్నికల్లో టిడిపికి ఘన విజయానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బొల్లినేని వెంకట రామారావు మళ్లీ చేస్తాను సభ్యులుగా తిరుగులేని ఘనవిద్యాలు సాధించడం అని ప్రతికార్యకర్త ఈ సంబరాలను బాణాసంచారాలతో ప్రతిగ్రామాన్ని జరుపుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో బొజ్జ నర్సింలు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ లక్ష్మీ, నరసయ్య, రియాజ్, ఓబుల్ రెడ్డి, రాజా, వెంకటస్వామి, మాలకొండయ్య, బ్రహ్మారెడ్డి, మాబాషా, సజిల్, ఖాదర్ బాషా, బాలకృష్ణ, పులి సంధాని, జల్సా వెంకటేశ్వర్లు, శివకృష్ణ, కార్యకర్తలు పాల్గొన్నారు.