Mar 25,2023 00:11

అంకమ్మచౌదరిని అభినందిస్తున్న మస్తాన్‌వలి తదితరులు

గుంటూరు: రాష్ట్ర కిసాన్‌ కేతు మజ్దూర్‌ సెల్‌ వైస్‌ ఛైర్మన్‌గా లావు అంకమ్మచౌదరి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక కాంగ్రెస్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి, జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు, నగర అధ్యక్షులు షేక్‌.ఉస్మాన్‌ తదితరులు అంకమ్మ చౌదరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల పక్షాన నిలిచిన పార్టీ కాంగ్రెస్‌ అని, కానీ దేశంలో 60శాతం ప్రజలు ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని బిజెపి నిర్లక్ష్యం చేస్తుందని నాయకులు విమర్శించారు. కార్యక్రమంలో అడ్వకేట్‌ మంగళపూరి శ్రీనివాసరావు, కరీమ్‌, తదితరులు పాల్గొన్నారు.