Jul 29,2021 21:24

మాట్లాడుతున్న టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎరిక్షన్‌ బాబు

ప్రజాశక్తి-పుల్లలచెరువు : రాష్ట్ర ప్రభుత్వం టిడిపి నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్‌ బాబు తెలిపారు. పుల్లలచెరువులో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి దేవినేని ఉమాను అరెస్టు చేయడం దారుణమన్నారు. దేవినేని ఉమాపై 18 అక్రమ కేసులు బనాయించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని మరచి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. డిజిపి ఆఫీస్‌కు కూతవేటు దూరంలో ఎస్‌సి బాలికపై అత్యాచారం జరిగితే నేటికీ నిందితులను అరెస్టు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో పుల్లలచెరువు సర్పంచి బడిపాటి ఓబులు, టిడిపి నాయకులు కోటయ్య, మేడికొండ లక్ష్మీ నారాయణ, కుమారస్వామి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.