Jan 14,2021 07:07

ముప్పది రోజుల ముందు నుంచే
ముచ్చటగొల్పే సంక్రాంతి
కాలం కలసిరాని వేళ
కళ తప్పిపోయింది
కల్లాల్లో రాసుల్లేవు
రైతు కళ్ళల్లో వెలుగుల్లేవు
పల్లెటూరి అందాలకు
సరికొత్త సొగసుల్లేవు
గంగిరెద్దుల సవ్వడి లేదు
హరిదాసుల కీర్తనల్లేవు
అత్తవారింట
కొత్తల్లుళ్ళ సందడి లేదు
బావామరదళ్ళ అల్లరి లేదు
అతిథులకు ఆహ్వానం లేదు
ఆత్మీయ ఆలింగనాల్లేవు
కోడి పందాల జోరు లేదు
కుర్రకారులో హుషారు లేదు.
ఇళ్ళల్లో పిండి వంటలు
వీధుల్లో భోగిమంటలు తప్ప.
                                * యం.యస్‌. రాజు, సెల్‌ : 95020 32666