Nov 24,2021 22:01

ప్రపంచకప్‌ జూ.హాకీ టోర్నీ
భువనేశ్వర్‌: ఎఫ్‌ఐహెచ్‌ ప్రపంచకప్‌ జూనియర్‌ హాకీ టోర్నీలో భారతజట్టు తొలిమ్యాచ్‌లో పోరాడి ఓడింది. బుధవారం జరిగిన గ్రూప్‌ాబి తొలి లీగ్‌ పోటీలో భారత్‌ 4ా5 గోల్స్‌ తేడాతో ఫ్రాన్స్‌ చేతిలో ఓడింది. ఫ్రాన్స్‌ కెప్టెన్‌ క్లెమెంట్‌ టిమొథీ హాట్రిక్‌ గోల్స్‌తో జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ఇరుజట్లు 2ా2 గోల్స్‌తో సమంగా ఉండగా.. రెండో అర్ధభాగంలో మన కుర్రాళ్లు చివర్లో రెండు గోల్స్‌ కొట్టారు. ఫ్రాన్స్‌ జట్టు కెప్టెన్‌ మాత్రం మరో రెండు గోల్స్‌ కొట్టాడు. ఇదే గ్రూప్‌లో ఉన్న పోలెండ్‌ 1ా0తో పోలెండ్‌ను ఓడించింది. దీంతో ఫ్రాన్స్‌, పోలెండ్‌ జట్లు గ్రూప్‌ాబిలో 3 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాయి. ఇక గ్రూప్‌ాడిలో జర్మనీ జట్టు 5ా2 గోల్స్‌ తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుచేసింది. గ్రూప్‌ాఏలో మాత్రం బెల్జియం, మలేషియా జట్లు శుభారంభం చేశాయి. బెల్జియం జట్టు 5ా1 గోల్స్‌ తేడాతో దక్షిణాఫ్రికాను, మలేషియా జట్టు 2ా1తో చిలీని ఓడించాయి.