
ప్రజాశక్తి - కారంచేడు
టిడిపి సీనియర్ నాయకులు ఎఎంసి మాజీ చైర్మన్ యార్లగడ్డ అక్కయ్య చౌదరి అధ్యక్షతన కళ్లకుగంతలతో విన్నూత్నంగా టిడిపి నాయకులు మంగళవారం నిరసన చేపట్టారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా 11వ రోజు నిరసన చేశారు. ప్రజలకు చీకటి రోజులు పోవాలని కోరారు. మరల సుపరిపాలన రావాలని అన్నారు. అక్రమ కేసులు నుండి చంద్రబాబు బయటికి రావాలని కోరుకుంటూ కళ్ళకు గంతలు కట్టుకొని తమ నిరసన తెలిపారు. కార్యక్రమంలో కంభంపాటి నరేంద్ర, పోతిని వెంకటేశ్వర్లు, పాతూరి ఆదిలక్ష్మి, కొల్లా భాస్కరరావు, శివరాం, గద్దె సుబ్బయ్య, తాళ్లూరు అనిల్ కుమార్, యార్లగడ్డ సాయి కృష్ణ పాల్గొన్నారు.