May 15,2022 07:37

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : కళ్లం గ్రూప్‌ ఆఫ్‌ ఇండిస్టీస్‌ అధినేత కళ్లం హరనాథరెడ్డి (86) శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో గుంటూరులోని ఉదరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. భౌతికకాయాన్ని శ్యామల నగర్‌లోని ఆయన స్వగృహానికి తరలించారు. ఆయనకు భార్య సుబ్బాయమ్మ, కుమారుడు మోహన్‌ రెడ్డి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హరనాథరెడ్డి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కళ్లం హరనాథరెడ్డి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ డైరెక్టర్‌ ఉమాశంకర్‌ రెడ్డి దిగ్భ్రాంతికి గురయ్యారు. కళ్లం గ్రూప్‌ ఆఫ్‌ ఇండిస్టీస్‌ ఉద్యోగులు, అధికారులు, పలు పార్టీల నేతలు సంతాపం తెలిపారు.