Apr 20,2021 21:39

ఉద్యోగాలు పొందిన విద్యార్థులతో ఉమాశంకర్‌రెడ్డి తదితరులు

ప్రజాశక్తి-గుంటూరు : కళ్లం హరనాధరెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజిలో మంగళవారం చెన్నైకి చెందిన సింటెక్స్‌ ఆటోమొబైల్స్‌ ప్లాస్టిక్‌ తయారీ కంపెనీ నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో కళాశాలలో ఆఖరి సంవత్సరం చదువుతున్న 15 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ యం.ఉమాశంకర్‌రెడ్డి తెలిపారు. ఉద్యోగాలు పొందిన వారు రూ.2 లక్షల వార్షిక వేతనం పొందుతారని కళాశాల ఉపాధి కల్పనాధికారి డాక్టర్‌ పిఎల్‌.మాధవరావు తెలిపారు. ఆయా విద్యార్థులను కళాశాల సెక్రెటరీ కళ్లం మోహనరెడ్డి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బిఎస్‌బి రెడ్డి , విభాగాధిపతులు డాక్టర్‌ యస్‌.వి.రమణమూర్తి, డాక్టర్‌ షణ్ముఖరావు అభినందించారు.